Monday, April 11, 2022

మంగళకరమవు నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవినమే ఇక పావనమవుగాక నీ పాలనా శ్రీకారమవుగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక జగదానందకారక జయ జానికి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక


జగదానందకారక 
జయ జానికి ప్రాణ నాయక 
ఆ ఆ 
జగదానంద కారక 
జయ జానకి ప్రాణ నాయక 
శుభ స్వాగతం ప్రియ పరిపాలక 
జగదానంద కారక 
జయ జానకి ప్రాణ నాయక 
శుభ స్వాగతం ప్రియా పరిపాలక 

మంగళకరమవు నీ రాక 
ధర్మానికి వేదిక అవుగాక 
మా జీవినమే ఇక పావనమవుగాక 
నీ పాలనా శ్రీకారమవుగాక 
సుఖశాంతులు సంపదలిడుగాక 
నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక 
జగదానందకారక 
జయ జానికి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక 

సార్వ భౌమునిగా పూర్ణ కుంభములు స్వగాతాలు పలికే 
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే 

నాల్గు వేదములు తన్మయత్వమును జలధి మారు మ్రోగే 
న్యాయ దేవతై శంఖమూదగా పూల వాన కురిసే 
రాజమకుటమే వొసఁగెలే నవరత్నం కాంతి నీ రాజనం 
సూర్యవంశం సింహాసనం పులకించి చేసే అభివందనం 
సామ్రాజ్య లక్ష్మి ఈపద సపర్సకి పరవశించే పోయే 

జగదానందకారక 
జయ జానికి ప్రాణ నాయక 
ఆ ఆ 
జగదానంద కారక 
జయ జానకి ప్రాణ నాయక 
శుభ స్వాగతం ప్రియ పరిపాలక 
జగదానంద కారక 
జయ జానకి ప్రాణ నాయక 
శుభ స్వాగతం ప్రియా పరిపాలక 

మంగళకరమవు నీ రాక 
ధర్మానికి వేదిక అవుగాక 
మా జీవినమే ఇక పావనమవుగాక 
నీ పాలనా శ్రీకారమవుగాక 
సుఖశాంతులు సంపదలిడుగాక 
నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక 
జగదానందకారక 
జయ జానికి ప్రాణ నాయక
 శుభ స్వాగతం ప్రియ పరిపాలక 



 శివశివ మూర్తివి గణనాథా

శివశివ మూర్తివి గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
ఛల్ సిరికి హరికీ మనువంట
సిరికి హరికీ మనువంట
భళరే అనరా జనమంతా
భళరే అనరా జనమంతా
హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి
చిందు కొట్టే జగమంతా

అదిరే అదిరే కన్నే అదిరే
అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటిసారిగా ఎదురయిందిగా
వయసు వేడుకా ఓ… ఓ…
అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే

ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో
వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
హెయ్ వరసై పిలిచే అందాలు
అరె మనమై చిలికే గంధాలు
అహ మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రణము చేరగా రమణి కోరిక అదుపు దాటగా
అదిరే అదిరే కన్నే అదిరే
ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే

పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో
కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
పందార తునకో పదం లేని తెలుగో
మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేళాలు
హో హో చెవిలో పడనీ మేళాలు
అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా
అదిరే అదిరే కన్నే అదిరే
హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్…


శుభకరుడు సురుచిరుడు… భవహరుడు భగవంతుడెవడూ


అల్లా…
శ్రీ రామా… ఆఆ ఆ
శుభకరుడు సురుచిరుడు… భవహరుడు భగవంతుడెవడూ
కల్యాణ గుణఘనుడు… కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనంద నందనుడు… అమృతరస చందనుడు
రామచంద్రుడు కాకా ఇంకెవ్వడూ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి… ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తియును గానీ రసమూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్రమూర్తి

తాగరా… ఆ ఆ, తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ, శ్రీ రామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా, కోదండ రామా
మపనిసరి సానీ పానీపామా… సీతారామా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా… ఆనందరామా
మా మా రిమరిమరిసరిమా… రామా జయరామా
సరిమా రామా సపమా రామా… పా ఆఆఆ వన రామా

ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను గల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు… ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు
తాగరా ఆఆ ఆఆ… తాగరా శ్రీ రామా నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం





Mighty Blessings from Eternal immortal father mother and masterly abode of Sovereign Adhinayaka Bhavan New Delhi