Thursday, March 7, 2019

దశరథుడి కోసం రాజ్యాన్నొదిలేసి ..
సుగ్రీవుడనే స్నేహితుడ్ని కాపాడటం కోసం నియమాన్నీ పక్కనపెట్టి..!
ఎవరో ఏదో అన్నారని ప్రజలకోసం భార్యని దూరం చేసుకుని..
ఇలా జీవితమంతా ధర్మం కోసం ఐహికసుఖాల్ని కాదనుకున్న రామతత్వం అర్ధం కావాలంటే ఎన్ని జన్మలెత్తాలో గదా మూర్ఖ రేణువులకి.. !!
పోనీ మనం కూడా కపిత్వం రాద్దామా అంటే చేతగాని పనైపోయిందది..
శత్రువులకి కూడా గౌరవంగా దహనసంస్కారాలు చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్న నీ ఆదర్శ లక్షణాల్ని కాసేపు పక్కన పెట్టి నిన్నొకటి అడుగుదామని నిర్ణయించుకున్నా రామా.. !!
నారవస్త్రాలతో అరణ్యవాసం మొదలుపెట్టావ్..
బంగారులేడితో మోసగింపబడ్డావ్..
సీతనెత్తుకుపోతే రోదించావ్..
కనబడని శత్రువుకోసం ఒక్క తమ్ముడితో బయల్దేరి మధ్యలో వానరులనే గొప్ప వనరుల్ని భక్తకోటిగా మార్చుకుని లంకని జయించిన నీ చెంతకి నీ సీత చేరేనాటికి నీ వెనుక ఉన్న బలగం చూస్తే అర్ధం కావట్లేదా ఎక్కడ్నించి మొదలుపెట్టి ఎక్కడిదాక ఎదిగావో.. నీకంటే హీరో ఎవరుంటారసలు..??
ఈ ప్రాసెస్లో ఎక్కడన్నా 'నేను దేవుడ్ని.. నన్నే నమ్ముకోండి.. మీకోసమే నేను కిందకొచ్చాను, మీకు పైకెళ్లాక పాపాల్నించి రక్షిస్తాను' లాంటి భయపీడిత సెల్ఫ్ డిస్క్లైమర్స్తో జనాల్ని బెదరగొట్టావా పోనీ..
లేదే.. !! ఎవరికర్ధమైనట్టు వాళ్ళనుకున్నారు.. దేవుడిగా తెలుసుకున్నారు.. దణ్ణం పెట్టుకున్నారు..
పోనీ సీతమ్మ తల్లి ఏమైనా గడుసుదా అనుకుంటే చాల్లే.. ఆవిడ ముందే నోట్లో నాలుక లేని మనిషి.. కాబట్టే కదూ అన్ని కష్టాలు..
ఇలా జీవితమంతా కడగండ్లే తప్ప మిమ్మల్ని మీరు ఏనాడూ దేవుళ్లగా ప్రకటించుకోకపోయినా సరే మరెందుకంటావ్ తండ్రీ మీరంటే అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆ కపిత్వం గాళ్ళకి..??

బహుశా ఒక్కటే కారణం అయ్యుండొచ్చు రామా... 🤔
నీ భక్తులెవరైనా సరే నీ కళ్యాణం రోజున పదిమందికీ అన్నంపెట్టి, బెల్లం పానకం తాగించి మీ జంటలాగా ఆదర్శవంతంగా ఉండాలని చెప్తారు తప్ప..
ద్రాక్షసారాలు పట్టించి, జనాల్ని వరుసగా నించోబెట్టి ఒకరిమీద ఒకరు పడిపోయే 'దయ్యం' స్కిట్లు చేయించరు గనుకనేమో మీ ఇద్దరూ అంటే అంత ఏడుపు వాళ్లకి.. 🙏
మహోన్నతమైన పోస్ట్ క్రెడిట్ :శ్రీమాన్ Haribabu Maddukuri గారు

No comments: