అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.
కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.
దృఢ: - చలించని స్వభావము కలవాడు.
సంకర్షణోచ్యుత: - విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము చెందనివాడు.
వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.
వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు, అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.
వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.
పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.
మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.
భగవాన్ - భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.
భగహా - ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.
ఆనందీ - ఆనందము నొసంగువాడు.
వనమాలీ - వైజయంతి అను వనమాలను ధరించినవాడు.
హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.
ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు. వామనుడు.
జ్యోతిరాదిత్య: - సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.
సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.
సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.
గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.
సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
ఖండ పరశు: - శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.
దారుణ: - దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.
ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.
దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.
సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మాతృగర్భమున జన్మించనివాడు.
త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.
సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడా తానే అయినవాడు.
సామ - సామవేదము తానైనవాడు.
నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.
No comments:
Post a Comment