Monday, July 6, 2020

   "సర్వకాల విదేశేషు స్వతం త్రో నిశ్చల స్సుఖీ 
అఖండైక రాసాస్వాద  తృప్తో హి పరమో గురుః 

భావము: సమస్త దేశ కాలాదులయందు  స్వతంత్రుడును, నిశ్చలుడును సుఖవంతుడును,అఖండైక అమృతపానము చేత తృప్తి చెందినవాడును పరమ గురువు అని చెప్పబడుచున్నది. 
---
సూక్ష్మంగా  చెప్పాలంటే -- వేద పదార్ధం విజ్ఞానము, బ్రహ్మనిష్ఠ, శాంతము, సమదృష్టి, ఇది నాది  - నేను చేయుచున్నాను అనే   భావన లేకుండుట, సుఖ దుఃఖాలకు లోబడకుండుట, అపేక్ష లేకుండుట, పరిశుద్ధత, శిష్యుని తరింపచేయవలెననెడి భావము, దయ భోధనాసక్తి మొదలగు సద్గుణములు గల సత్పురుషులే  సద్గురువు అనబడతారు. ఇట్టి సద్గురువును ఆశ్రయించి, సేవించి గురూపదేశమును పొంది, సాధన చేసి ఆత్మ జ్ఞానమును పొందవలెను         ,   
     -----

No comments: