ఆదమరచి నిద్రిస్తున్నాయి నేటి అనుబంధాలు..
As per the data of incidence,nearly 90% of reported sexual assaults are by known people.........
నల్లని మరకలు పడుతున్నాయి మన దేశం మీద.., కాదు కాదు మన బంగారు తల్లుల మీద...,నిమిషానికి ఒక్కటి...
పడితే పడనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
స్నేహితుడే మోహితుడై కిరాతకుడవుతున్నాడు., ప్రేమికుడే పామై కాటేస్తున్నాడు.,
బంధువే రాబందువై మీద పడి తార్చుతున్నాడు., చివరికి కని పెంచిన కన్న తండ్రే కరుణ లేని కసాయివాడై కరుస్తున్నాడు...
ఆదమరచి నిద్రిస్తున్నాయి నేటి అనుబంధాలు..
నిద్రపొనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
కామ వ్యాధి పట్టిన కాల యములు సమాజ కారడవిలో కామ క్రీడ ఆడుతుంటే నిర్లజ్జగ చూస్తుంది ఈ మా'లోకం'., మదం పట్టిన మగ జాతి మిమ్మల్ని చెరపట్టగా నిస్సిగ్గుగా చూస్తుంది ఈ న'సమాజం'.. చూడనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
ఆడదనే అమ్మ ఉన్నంతవరకు మల్లి మల్లి పుడతారు... ఆ ఆడదానికే సమాధి కడతారు.
గల్లి గల్లికి పెట్టిన గాంధి బొమ్మలు సిగ్గుతో తల దించుకుంటున్నాయి... కన్న కలల్ని కోల్పోయి కన్నీటికి ప్రతిరూపంగా మారుతుంది మా కన్న ఆడతల్లి...
మారని., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
ఇంకా కంపు కొడుతున్నాయి అత్యాచారానికి గురై అతి కర్కశంగా హత్య గావింపబడ్డ మా చిట్టితల్లుల మృతదేహాలు...
కొట్టనీ., ఆ వాసనలను సువాసనలుగా మార్చుకొని మళ్ళి మళ్ళి ఆ దేహాన్ని చిద్రం చేద్దాము.. మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
Prayer to #mahatma the #FatherOfTheNation
No comments:
Post a Comment