Monday, February 21, 2022

ద్వైతం-అద్వైతం-విశిష్టాద్వైతంllఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర...

అద్వైతం ....  ద్వైతం .....  విశిష్టాద్వైతం ......   

ద్వైతం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.

'స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి' - స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు

మధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడా వ్యవహరిస్తారు.

మధ్వ సిద్ధాంతం[మార్చు]

జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.

మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి

1. జీవుడు వేరు బ్రహ్మము వేరు (జీవ - దేవ భేదము)

2. ఒక జీవుడుకి, ఇతర జీవులకు భిన్నత్వం ఉంది (జీవ - జీవ భేదము)

3. జీవుడికి, జడ జగత్తుకు భేదం ఉంది (జీవ - జడ భేదము)

4. జడ జగత్తు వేరు, బ్రహ్మము వేరు (జడ - దేవ భేదము)

5. జడ జగత్తులో ఒక వస్తువుకి, ఇతర వస్తువులకు భేదం ఉంది (జడ - జడ భేదము)

ఈ భేదాలు నిత్యం, శాశ్వతం. జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా ఆ భేదాలు కొనసాగుతాయి.

జగత్తు మిథ్య కాదు. సత్యం, ఎందుకంటే అది ప్రత్యక్షంగా మన ఎదుట కనిపిస్తుంది. అది అశాశ్వతమైనంత మాత్రాన లేదా నిరంతర పరిణామం చెందుతున్నంత మాత్రాన లేకుండా పోదు. ఒక వస్తువును పోలి మరొకటి ఉండదు. అన్నింటా భేదం ఉంది. ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలుండటం జరుగదు.

బ్రహ్మం సర్వోత్తమం. సమస్త సద్గుణాలు బ్రహ్మంలో ఉన్నాయి. బ్రహ్మం ఆనంద స్వరూపం. ఆనందం కారణంగానే దానిచే ప్రేరణ పొంది బ్రహ్మం తన లీలానిమిత్తం ఈ జగత్తును సృష్టించింది. జగత్తు బ్రహ్మంయొక్క వ్యక్తరూపం. సృష్టికిముంది జదజగత్తు సూక్ష్మరూపంలో అవ్యక్తంగా బ్రహ్మంలో ఉంటుంది. సృష్టి సమయంలో అది స్థూలరూపం పొంది వ్యక్తమవుతుంది. బ్రహ్మం తనను తాను వ్యక్తం చేసుకునే విధానమే ఆ సమస్త జగత్తు. అయితే బ్రహ్మం జగత్తుకు అతీతం. బ్రహ్మం లేదా ఈశ్వరుడు సర్వ స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిశాలి, సర్వవ్యాపి.

జడజగత్తువలె జీవాత్మ కూడా స్వతంత్రుడు కాదు. కర్త కాదు. ఈశ్వరుడు మాత్రమే కర్త. జీవాత్మ తానే కర్త అనుకుంటాడు. అది భ్రాంతి. తాను కర్తను కానని, నిమిత్త మాతృడనని గ్రహించి ఈశ్వరునికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకుని నిష్కామ కర్మ చేస్తే అది జీవునికి బంధనం కాబోదు. తాను కర్తను అని అహంకారంతోను, మమకారంతోను భ్రమ చెందడం వల్లనే జీవాత్మ సుఖదుఃఖాలకు తలవొగ్గవలసివస్తుంది. ==భక్తితోనే ముక్తి==thumbవిష్ణు భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం పొందిన తర్వాత సర్వకర్త అయిన ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.

జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత - ఈమూడూ వేర్వేరు. జ్ఞాత (తెలుసుకునేవాడు) లేకుండా జ్ఞానం ఉండదు. అలాగే జ్ఞేయం (తెలుసుకోబడే విషయం). జ్ఞాత, జ్ఞేయం లేకుండా జ్ఞానం లేదు. నిర్గుణ బ్రహ్మం, కేవల జ్ఞానం అనేవి లేవు.

జీవులు మూడు విధాలు. ఒక వర్గం భగవద్భక్తులై ధార్మిక జీవనం గడుపుతూ ముక్తులవుతారు. రెండవ వర్గం ఎప్పటికీ ముక్తులు కాలేరు. జననమరణ సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మూడవ వర్గం భగద్విరోధులై శాశ్వత నరకం పొందుతారు.

ముక్తి నాలుగు విధాలు. ఒకటి సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం, రెండు సామీప్యం - భగవంతుడి సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం, మూడు సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం, నాలుగు సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.



Yours Ravindrabharath as the abode of Eternal, Immortal, Father, Mother, Masterly Sovereign (Sarwa Saarwabowma) Adhinayak Shrimaan.



Shri Shri Shri (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Mahatma, Acharya, Baap Dada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Samanvaya Drusti, Purushottama, (King & Queen) Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal aboard of the (Sovereign) Sarwa Sarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka, Government of Sovereign Adhinayaka, Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. "RAVINDRABHARATH" Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla,
Adhar Card No.539960018025.
hismajestichighness.blogspot@gmail.com,
Lord His Majestic Highness Maharani Sametha Maharajah (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARATH" Erstwhile Rashtrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad
Mobile.No.9010483794,8328117292,
Blog: hiskaalaswaroopa.blogspot.com
Jurisdiction concern: Telangana State Representative Sovereign Adhinayaka, Erstwhile Governor, Rajbhavan, Hyderabad


No comments: