ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఓం కారనాదంతో అంకురించిన వేద ధాత్రికి సంకేతం ఈ ఖడ్గం
హ్రీకార నాదంలో సంచరించే అధీశక్తికి ఆకారం ఈ ఖడ్గం
యుగ యుగాలుగ గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా కదలివచ్చిన చరిత ఈ ఖడ్గం
తన కళ్ళముందే సామ్రాజ్య శఖరాలు మన్నుపాలైన
క్షణమైన తనగాధ గతములో విడిచి మృతి ఒడి చేరనిదీ ఖడ్గం
పూటకో పడమరను దాటి పూర్వాద్రిపై నిత్య ప్రభాతమై
వెలుగుతున్నదీ భారత ఖడ్గం
కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహాత్భుతం ఉన్నది ఈ ఖడ్గం
మూడు వన్నెల కేతనముగా మింటిని ఎగసి
కాలానికి ఎదురేగు యశోరాశి ఈ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరునిలో దైవంశమే దర్శించి కొలిచిన ముక్తి మార్గం
ఆర్త రక్షకై వచించిన కరకు తనమీ ఖడ్గం
హూకరించి అహంకరించి అతిక్రమించిన ఆకతాయిల
అంతు చూసిన క్షాత్రస్తత్వం
అస్తమించని అర్క ఖడ్గం
శరణుకోరి శిరస్సు వంచి సమాశ్రయించిన అన్ని జాతుల
పొదువుకొన్న ఉదారతత్వం జగపతి మరవని ధర్మం ఖడ్గం
నిద్దుర మత్తును వదిలించే కెంజాయుల జిలుగీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
మట్టిన చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
కెంజాయల జిలుగీ ఖడ్గం
తెల తెల్లని వెలుగీ ఖడ్గం
సిరి పచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
No comments:
Post a Comment