అధినాయకులు సదా అన్నీ ఆలోచన లో అన్నీ రూపలాలు శాశ్వతమైన వాక్ విశ్వరూపంగా యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు గా అందుబాటులో ఉన్నారు రోజులు తపస్సు గా వాక్ విశ్వరూపం పై మనసు పెట్టి కనీసం 20-30 పేజీలు వ్రాయడం చెప్పడం చెయ్యండి తెలుగు వారు ఇతర భాషల వారికి చెప్పండి అనువదించి వివరంగా చెప్పుకోండి divine intervention జగత్తగా సాక్షులు ప్రకారం ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి మమ్ములను రాజ్యాంగ బద్దంగా బృంధం లోకి ఆహ్వానించి కొలువు తీర్చుకొని ప్రతి ఒక్కరు మనసు పెంచుకోండి ఇక నేను ఒక కేవలం మనిషి అనే మమ్ములను గాని తమని తాము గాని భావించకండి, ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని మమ్ములను కూడా మనసుగా పెంచుకోవడమే భౌతిక ఆస్తి కంటే జ్ఞాన ఆస్తి గా లోకాన్ని తెలుసుకొని చావు పుట్టకల రహస్యాలు కూడా తెలుసుకొని సూక్ష్మంగా మనసు పెంచుకొని సాటి వారిని కూడా మనసు పెచుకోనివ్వడం వలన సదా మనసులు పెరిగి జ్ఞాన సంపద జ్ఞాన ఆయుషు అనగా శాశ్వత సిద్ది దివ్యత్వం వైపు యోగాత్వం వైవు సదా ముందుకు మనసు ఆలోచించనతో కదలడమే యోగం తపస్సు శాశ్వత మార్గం యావత్తు మానవజాతికి అందిన మార్గం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.
సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.
భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.
ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.
పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.
మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.
ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.
విధాతా - కర్మఫలముల నందించువాడు.
ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.
అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.
హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.
అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.
విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.
విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.
మను: - మననము (ఆలోచన) చేయువాడు.
త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.
స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.
అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.
శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.
పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.
పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.
ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.
ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.
ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.
జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)
శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.
ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.
హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.
హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.
భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.
మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.
మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.
ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
విక్రమీ - శౌర్యము గలవాడు.
ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
క్రమ: - నియమానుసారము చరించువాడు.
అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
శర్మ - పరమానంద స్వరూపుడు.
విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
అజ: - పుట్టుకలేని వాడు.
సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.
సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.
సిద్ధి: - ఫలరూపుడైనవాడు.
సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.
అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.
వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.
అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
సత్య: - సత్య స్వరూపుడు.
సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
బభ్రు: - లోకములను భరించువాడు.
విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
శుచిశ్రవా: - శుభప్రథమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
అమృత: - మరణము లేనివాడు.
శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.