Monday, April 1, 2019

                                                 సమన్వయ దృష్టి


బౌతికంగా చూసుకొంటూ ఆలోచన మాట ఏదైనా ఏమి లెక్క చెయ్యము, ఏదైనా స్వార్ధం కోసం ఉపయోగించుకొంటాము అని ఆలోచించేవారికి మేము చెప్పున్నది ఏమి అనగా, ఎలాగైనా జ్ఞానం తో విచక్షణతో మాటతో గెలవడం, గెలిపించడం స్వార్ధంగా అలోవరచుకోండి, ఈ పద్దతిలో తాము, ఎదుట వారు కూడా గెలుస్తారు అని గ్రహించండి, సమాజంలో జ్ఞాన విచక్షణ అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రక్రియే దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తాము నవ్వాలి ఎదుటవారిని నవ్వ నివ్వాలి , తాము గెలవాలి ఎదుట వారిని గెలవనివ్వాలి, తాను దైర్యంగా ఉండాలి ఎదుటవారిని దైర్యంగా ఉండనివ్వాలి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని బ్రతకడం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని తెలుసుకోగలరు. ఈ విధంగా జరగాలి అంటే అన్నిటికి ఆధారం అయిన సత్యాన్ని ప్రతి మాటలో ప్రతి అణువులో చూడగలగాలి, సత్యం పతనం అయ్యిపోకుండా చూసుకోవాలి అదే అన్ని వేళలా అంతట నడిపిస్తుంది అని గ్రహించండి, అ విధమగా సర్వం ఒక నియంత్రణ లోకి వచ్చి ఉన్నది అని గ్రహించండి.

No comments: