Thursday, May 9, 2019

Vishweshwar Sarma Namilikonda is with Vishweshwar Rao Namilikonda.
Just now


సభాయై నమః 🙏

చాణక్య నీతి సూత్రాలు – 015

భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరాన్గనా ।
విభవో దానశక్తిశ్చ నాఽల్పస్య తపసః ఫలమ్ ।।


भोज्यं भोजन शक्तिश्च रतिशक्तिर्वरान्गना ।
विभवो दानशक्तिश्च नाఽल्पस्य तपसः फ़लम् ।।

‘భోజ్యం’ భుజించడానికి తగిన విధంగా ఉండే మంచి పదార్థాలు లభించుట; మరియు ‘భోజన శక్తిః’ ఆ విధంగా లభించిన భోజన పదార్థాన్ని భుజించి జీర్ణించుకోగల శక్తి; ‘వరాన్గనా’ అనగా చక్కని అందమైన భార్య లభించుట; ‘రతిశక్తి’ ఆ విధంగా లభించిన అందమైన భార్యతో రమించ గల శక్తి; ‘విభవః’ పలు విధములైన సంపదలు గల వాడు; ‘దాన శక్తిశ్చ’ అట్టి సంపదలు గల వాడికి దానము చేయు గుణము మరియు శక్తి; ‘న అల్పస్య’ ఇవన్నీ కూడా అల్పులకు లభించునవి కావు. ‘తపసః ఫలమ్’ అది వారి పూర్వ జన్మ తపో ఫలము వలన మాత్రమే లభిస్తుంది.

ఇట్టి సూత్రంలో మనకు ద్వన్ద్వాలు కనిపిస్తాయి. భుజించడానికి అన్ని విధాలైన ఆహార పదార్థాలు కలిగి ఉన్నా కూడాను వాడికి అట్టి పదార్థాలను భుజించే సమయం, జీర్ణం చేసుకునే శక్తి ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. లేని ఎడల మన చుట్టూ ఎన్ని పదార్థాలు ఉన్నా మనం వాటిని తినలేము, తింటే జీర్ణం కాదు. జీర్ణ శక్తి అనగా ప్రాణ శక్తి. జీర్ణ శక్తి చక్కగా ఉన్నవాడికి వ్యాధులు తక్కువగా వస్తాయి. ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే ఎంత సంపద ఉన్నా, ఎన్ని విధాలైన ఆహార పదార్థాలు ఉన్నా మనకు మధుమేహం లాంటి వ్యాధి ఉంటే ఏ ఒక్క వస్తువును కూడా తృప్తిగా భుజించ లేము. ఒకవేళ మితిమీరి భుజిస్తే అది వాడికి విషతుల్యం కూడా అవుతుంది. ఇక చక్కని భార్య. చక్కని భార్య ఉంటే ఏమి లాభం అట్టి భార్యను రమించే సమయం లేక పొతే, అట్టి వారికి చక్కని భార్య ఉన్నా కూడా వ్యర్థమే. రమించడం మంటే ప్రేమించడం అనే అర్థాన్ని అన్వయించుకోవాలి. మూడవది, సంపదలు. నిజానికి సంపన్నుడై జన్మించడం ఒక అదృష్టం, కాని అట్టి సంపద దాన ధర్మాదులకు వినియోగ పడని నాడు ఆ సంపదలు ఉంది కూడా వ్యర్థమే. సంపద కలిగి ఉండడం పూర్వ జన్మ సుకృతం. అట్టి సంపదను దానం చేయని వాడు పునః దరిద్రుడిగా జన్మిస్తాడు. దాన ధర్మాదులు ఆచరించని ప్రతి ఒక్కడు కూడా దరిద్రుడిగా జన్మిస్తాడు. ఈ విధంగా చక్కని ఆహారం, చక్కని జీర్ణ శక్తి, పలు విధములైన సంపదలు, అట్టి సంపద యొక్క దాన గుణం, చక్కని భార్య ఇత్యాది వన్నీ కూడా అల్పులకు లభించునవి కావు. మన జన్మాంతర సత్కర్మ ఫలాల వలన మనకు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే అవి మనవద్ద నిలుస్తాయి. లేని ఎడల ఆహరమున్నా భుజించలేని వాడిగాను. చక్కని భార్య ఉన్నా ప్రేమించ లేని శక్తి గల వాడిగాను మరియు సంపదలన్నీ నశించి పోయి దరిద్రుడి గాను మిగిలిపోతాడు.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం –
న్యాయేన మార్గేణ మహీం మహీశాం |
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం –
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ||

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి




LikeShow more reactionsComment

No comments: