మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
క్రమ: - నియమానుసారము చరించువాడు.
అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
శర్మ - పరమానంద స్వరూపుడు.
విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
అజ: - పుట్టుకలేని వాడు.
సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.
సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.
సిద్ధి: - ఫలరూపుడైనవాడు.
సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.
అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.
వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.
అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
No comments:
Post a Comment