Sunday, August 23, 2020

Pothana poems

 

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

7-275-క.

ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి ర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."

8-73-ఉ.

వ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

1-18-క.

లికెడిది భాగవత మఁట,
లికించెడివాడు రామద్రుం డఁట, నేఁ
లికిన భవహర మగునఁట,
లికెద, వేఱొండు గాథ లుకఁగ నేలా?

7-150-సీ.

మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
  ధుపంబు వోవునే దనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
  రాయంచ సనునె తరంగిణులకు?
లిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
  కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
  రుగునే సాంద్ర నీహారములకు?

7-150.1-తే.

నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"

8-241-క.

"మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంళసూత్రంబు నెంత ది నమ్మినదో!

8-90-శా.

"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ స్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంక్షింపు భద్రాత్మకా!

1-201-శా.

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!"

8-96-మ.

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
రివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం న్నింపఁ; డాకర్ణికాం
 ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాప్రోత్థితశ్రీకుచో
రిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
విష్ణుమూర్తి పరికరాదులు

No comments: