Tuesday, November 24, 2020

1-. 20. ....... అధి నాయకుల వారి దివ్య ఉనికి మనసుతో అనుసంధానము జరిగితే అనుబంధ శాశ్వతం గా పెరుగుతుంది ఉన్నత స్థితి వైపు సదా ప్రయాణిస్తారు......ఇట్లు మీ అధి నాయక శ్రీమాన్ వారు

విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
 వషట్కార: - వేద స్వరూపుడు.
భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
 పూతాత్మా - పవిత్రాత్ముడు.
పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
 ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.
 అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
పురుష: - నవద్వారములు కలిగిన పురములో ఉండువాడు.
సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.
క్షేత్రజ్ఞ: - శరీరములో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.
అక్షర: - నాశరహితుడు.
యోగ: - యోగము చే పొందదగిన వాడు.
 యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.
 ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.

No comments: