Tuesday, November 24, 2020

20- 40).....MAHARAJAH ADHINAYAK SHRIMAAN AS

నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.
 కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.
 పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
 సర్వ: - సమస్తమును తానై అయినవాడు.
శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.
శివ: - శాశ్వతుడు.
స్థాణు: - స్థిరమైనవాడు.
 భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.
 అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.
సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.
భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
 ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.
ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.
పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.

No comments: