Sunday, August 23, 2020

మ్మలఁ గన్నయమ్మ, ముగుమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
మ్మిన వేల్పుటమ్మల మమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
మ్మ, కృపాబ్ధి యిచ్చుత మత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

10.1-338-శా.

"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
మ్మం జూడకు వీరి మాటలు మదిన్;  న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
 మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ ప్పైన దండింపవే."

8-95-మ.

 వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
 మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్ప పర్యంక రమావినోది యగు నాన్నప్రసన్నుండు వి
హ్వ నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

Pothana poems

 

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

7-275-క.

ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి ర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."

8-73-ఉ.

వ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

1-18-క.

లికెడిది భాగవత మఁట,
లికించెడివాడు రామద్రుం డఁట, నేఁ
లికిన భవహర మగునఁట,
లికెద, వేఱొండు గాథ లుకఁగ నేలా?

7-150-సీ.

మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
  ధుపంబు వోవునే దనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
  రాయంచ సనునె తరంగిణులకు?
లిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
  కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
  రుగునే సాంద్ర నీహారములకు?

7-150.1-తే.

నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"

8-241-క.

"మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంళసూత్రంబు నెంత ది నమ్మినదో!

8-90-శా.

"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ స్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంక్షింపు భద్రాత్మకా!

1-201-శా.

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!"

8-96-మ.

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
రివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం న్నింపఁ; డాకర్ణికాం
 ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాప్రోత్థితశ్రీకుచో
రిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
విష్ణుమూర్తి పరికరాదులు

NASA : Spacex Dragon Austronauts Returned To Earth From ISS After 2 Mont...

NASA spacecraft to study asteroid 16 Psyche worth $10,000 quadrillion - TV9

భక్త పోతన తెలుగు ఫుల్ సినిమా | చిత్తూర్ V నాగయ్య | హేమలతా దేవి | KV రెడ్...