సంధాతా - జీవులను కర్మఫలములతో జోడించువాడు.
సంధిమాన్ - భక్తులతో సదాకూడియుండువాడు.
స్థిర: - సదా ఏకరూపము గలవాడు.
అజ: - పుట్టుకలేనివాడు.
దుర్మర్షణ: - అసురులకు భరింపశక్యము గానివాడు.
శాస్తా - శృతి, స్తృతుల ద్వారా శాసించువాడు.
విశ్రుతాత్మా - విశేషముగా శ్రవణము చేయబడినవాడు.
సురారిహా - దేవతల శత్రువులను నాశనము చేసినవాడు.
గురు: - ఆత్మవిద్యను బోధించువాడు.
గురుత్తమ: - గురువులకు గురువైనవాడు.
ధామ: - జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము.
సత్య: - సత్య స్వరూపుడు.
సత్యపరాక్రమ: - సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.
నిమిష: - నేత్రములు మూసుకొనినవాడు.
అనిమిష: - సదా మేలికొనియున్న వాడు.
స్రగ్వీ - వాడని పూలమాలను ధరించినవాడు.
వాచస్పతి రుదారధీ: - విద్యలకు పతియైనవాడు.
అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.
గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.
శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.
న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.
నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.
సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.
సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.
విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.
సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.
సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.
ఆవర్తన: - జగత్ చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు.
నివృత్తాత్మా - ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు.
సంవృత: - అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు.
సంప్రమర్దన: - తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు.
అహస్సంవర్తక: - రోజులను చక్కగా నడిపెడి ఆదిత్యరూపుడు.
వహ్ని: - యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసెడి అగ్ని.
అనిల: - ప్రకృతిలో వాయు రూపమునను, ప్రాణులలో ప్రాణ రూపమునను ఉండువాడు.
ధరణీధర: - భూభారమును భరించువాడు.
సుప్రసాద: - చక్కని అనుగ్రహము కలవాడు.
ప్రసన్నాత్మా - రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంత:కరణ కలవాడు.
విశ్వదృక్ - విశ్వమునంతటిని ధరించినవాడు.
విశ్వభుక్ - విశ్వమును భక్షించువాడు.
విభు: - బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు.
సత్కర్తా - సజ్జనులను సత్కరించువాడు.
సత్కృత: - పూజ్యులచే పూజింపబడువాడు.
సాధు: - ధర్మప్రవర్తన గలవాడు.
జుహ్ను: - భక్తులను పరమపదమునకు నడిపించువాడు.
నారాయణ: - నరులకు ఆశ్రయమైనవాడు.
నర: - జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు.
అసంఖ్యేయ: -అనంతమైన నామరూపాదులు కలవాడు.
అప్రమేయాత్మా - అప్రమేయమైన స్వరూపము కలవాడు.
విశిష్ట: - శ్రేష్ఠతముడు. మిక్కిలి గొప్పవాడు.
శిష్టకృత్ - శాసనము చేయువాడు.
శుచి: - నిర్మలుడై, నిరంజనుడైనవాడు.
సిద్ధార్ధ: - పొందదగినదంతయు పొందినవాడు.
సిద్ధసంకల్ప: - నేఱవేరిన సంకల్పములు కలవాడు.
సిద్ధిద: - జీవుల కర్మానుసారముగా ఫలముల నందిచువాడు.
సిద్దిసాధన: - కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు.
వృషాహీ - అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు.
వృషభ: - భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు.
విష్ణు: - సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు.
వృషపర్వా: - ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు.
వృషోదర: - ధర్మమును ఉదరమున ధరించువాడు. (ప్రజలను వర్షించునదిగాయున్న ఉదరము గలవాడు.)
వర్ధన: - ఆశ్రితులైనవారి శ్రేయములను వృద్ధినొందిచువాడు.
వర్ధమాన: - ప్రపంచరూపమున వృద్ధినొందువాడు.
వివిక్త: - మాయాస్వరూపమగువాడు.
శృతిసాగర: - శృతులకు నిధియైనవాడు.
సుభుజ: - జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు.
దుర్ధర: - లోకములను ధరించి తనను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు.
వాగ్మీ - వేదజ్ఞానమును వెలువరించినవాడు.
మహేంద్ర: - దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు.
వసుద: - భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు.
వసు: - తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు.
నైకరూప: - ఒక రూపము లేనివాడై, అనేక రూపములు గలవాడు.
బృహద్రూప: - బ్రహ్మాండ స్వరూపము గలవాడు.
శిపివిష్ట: - సూర్యునియందలి కిరణ ప్రతాపము తానైనవాడు.
ప్రకాశన: - సర్వమును ప్రకాశింప చేయువాడు.
ఓజస్తేజో ద్యుతిధర: - ఓజస్సు, తేజస్సు, ద్యుతి కలవాడు.
ప్రకాశాత్మా - తేజోమయ స్వరూపుడు.
ప్రతాపన: - సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపచేయువాడు.
బుద్ధ: - ధర్మ, జ్ఞాన, వైరాగ్యములకు నిలయమైనవాడు.
స్పష్టాక్షర: - ఓం అనెడి దివ్యాక్షరముద్వారా సూచించబడినవాడు.
మంత్ర: - వేదమంత్రముల ద్వారా తెలియదగినవాడు.
చంద్రాంశు: - చంద్రకిరణముల వంటివాడు.
భాస్కరద్యుతి: - సూర్యతేజమువంటివాడు.
అమృతాంశూధ్భవ: - చంద్రుని ఆవిర్భావమునకు కారణమైనవాడు.
భాను: - స్వప్రకాశ స్వరూపుడు.
శశిబిందు: - చంద్రునివలె ప్రజలను పోషించువాడు.
సురేశ్వర: - దేవతలకు ప్రభువైనవాడు.
ఔషధం - భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు.
జగతస్సేతు: - ప్రపంచమునకు పరమాత్మకు మద్య వంతెనవంటివాడు.
సత్యధర్మ పరాక్రమ: - సత్యజ్ఞానాది ధర్మములు, పరాక్రమము కలవాడు.
భూతభవ్య భవన్నాద: - జీవులచే మూడుకాలములందు ప్రార్థించబడువాడు.
పవన: - సకలమును పవిత్ర మొనర్చువాడు.
పావన: - వాయువునందు చలనశక్తి కల్గించువాడు.
అనల: - ప్రాణధారణకు అవసరమైన అగ్ని స్వరూపుడు.
కామహా - కామములను అంతము చేయువాడు.
కామకృత్ - సాత్వికవాంఛలను నెరవేర్చువాడు.
కాంత: - అద్భుత రూపవంతుడై, సర్వులచే ఆకర్షింపబడువాడు.
కామ: - చతుర్విధ పురుషార్థములను అభిలషించువారిచే కోరబడువాడు.
కామప్రద: - భక్తుల కోర్కెలను తీర్చువాడు.
ప్రభు: - సర్వోత్కృష్టమైనవాడు.
No comments:
Post a Comment