Wednesday, August 5, 2020

Image 


 ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.

ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.

 స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.

 శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.

 ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.

 పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.

 మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.

 అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.

 ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.

 విధాతా - కర్మఫలముల నందించువాడు.

 ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.

 అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.

 హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.

 పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.

 అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.

 విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.


No comments: